డివైడర్ అవతలి నుంచి బైకును ఢీకొట్టిన కారు..

Tue,February 13, 2018 04:11 PM

Car hits bike at jodimetla junction


మేడ్చల్ : ఘట్ కేసర్ మండలం జోడిమేట్ల చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర నుండి ఉప్పల్ కు వేగంగా వస్తున్న కారు (టీఎస్ 8ఈటీ 444) డివైడర్ అవతలి వైపు నుంచి వస్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగి కృష్ణ చైతన్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కృష్ణ చైతన్య ఉప్పల్ నుండి అన్నోజీగూడకి బైక్ పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

1132
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles