కారు బోల్తా.. దంపతులు మృతి

Thu,January 17, 2019 09:12 AM

car accident in nizamabad dist

నిజామాబాద్: జిల్లాలోని డిచ్‌పల్లి మండలం న్యాకతండా వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు కారు బోల్తా పడింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles