ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌పై కారు బోల్తా.. ఒకరు మృతి

Wed,March 6, 2019 06:11 PM

car accident in ghatkesar ORR man died

మేడ్చల్‌: ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న‌ ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓఆర్‌ఆర్‌పై వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఖేమ్‌ చంద్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. కారు డ్రైవర్‌ సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సంతోష్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుడు ఖేమ్‌ చంద్‌ మధ్యప్రదేశ్‌ రాష్ర్టానికి చెందిన వ్యక్తిగా సంఘటనా స్థలంలో లభించిన ఆధార్‌ కార్డు ఆధారంగా గుర్తించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

3056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles