భారీ ర్యాలీలతో నామినేషన్లు వేసిన మంత్రులు

Mon,November 19, 2018 12:04 PM

candidates file nominations for telangana assembly polls

హైదరాబాద్ అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగియనున్న నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు రెబల్స్ కూడా నామినేషన్లు వేస్తున్నారు. టికెట్ దక్కని కొంతమంది ఆశావహులు ఇండిపెండెంట్‌గా పోటీకి నిలబడుతున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డి ఎన్నికల అధికారికి నామపత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ వేయ‌డానికి ముందు జగదీష్ రెడ్డి - సునీత కుటుంబ సభ్యులతో కలిసి సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

సూర్యాపేట బీజేపీ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వర్‌రావు నామినేషన్ వేశారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. నామినేషన్ల కార్యక్రమానికి టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పండుగ వాతావరణంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

1118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles