HomeLATEST NEWScancer screening centres in ten districts: lakshma reddy

పది జిల్లాల్లో కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు: లక్ష్మారెడ్డి

Published: Sat,March 18, 2017 01:59 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైదరాబాద్: కేన్సర్ వ్యాధిని గుర్తించేందుకు వీలుగా మొదట పది జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. గతంలో ప్రభుత్వాసుపత్రుల్లో డయాలిసిస్ సెంటర్లు ఉండేవి కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా ఆస్పత్రుల్లో డయాలిసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో మరో 34 సెంటర్ల ఏర్పాటుకు టెండర్లను పిలుస్తున్నామన్నారు. రెండు నెలల్లో ఈ సెంటర్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం డైయిరీని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. 2006 ఫుడ్ యాక్ట కఠినంగా లేదని తెలిపారు. ఫుడ్ యాక్ట్‌లో మార్పులు చేసి కల్తీకి పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇప్పటికే కల్తీని గుర్తించేందుకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేపట్టారని వివరించారు.
999
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology