సైదాబాద్: ప్రేమ పేరుతో నమ్మించి..రెండో పెండ్లి చేసుకుంటానంటూ బాలికను తీసుకెళ్లి క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం..సైదాబాద్ హరిజన బస్తీకి చెందిన భార్గవ్ (32) క్యాబ్ డ్రైవర్. అతని భార్య గర్భిణి. కాగా.. సైదాబాద్ పూసలబస్తీలో నివాముండే ఆటో డ్రైవర్ కుమార్తె (16) అతని ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది.
కాగా..బాలికను ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని కొంత కాలంగా వేధిస్తున్నాడు. విషయం తెలిసిన బాలిక తం డ్రి..అతన్ని హెచ్చరించాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. మాయమాటలతో బాలిక ఫొటోలు తీసి.. బాలిక తండ్రికి పంపించి.. మీ కుమార్తెను ప్రేమిస్తున్నానని, రెండో వివాహం చేసుకుంటానని చెప్పాడు..ఈ క్రమంలోనే భార్గవ్ భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో భార్గవ్..బాలికను యాదగిరి గుట్టకు తీసుకువెళ్లి లాడ్జిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని భార్గవ్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.