22 నుంచి 27 వరకు సినీ గీత,నృత్య విభావరి

Fri,July 20, 2018 09:54 AM

C Narayana Reddy 87th birthday celebrations from 22 to 27 July

హిమాయత్‌నగర్ : సుప్రసిద్ధ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి 87వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22 నుంచి 27 వరకు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో సినీ గీత, నృత్య విభావరి కార్యక్రమాలను నిర్వహించనున్నామని రసమయి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎం.కె.రాము తెలిపారు. కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్‌ను హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినారె తొలి చిత్రం గులేబకావళి కథలో నన్నుదోచుకుందువటే వన్నెల దొరసాని గీతంలో ఎన్టీఆర్‌తో నటించిన ప్రముఖ సినీనటి జమున, చలనచిత్ర నిర్మాత కె.రాఘవ, సుప్రసిద్ధ కవి డాక్టర్ జె.బాపు రెడ్డిలకు సినారె ప్రతిభా పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య, ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, డాక్టర్ కె.ఐ.వరప్రసాద రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి హాజరు కానున్నారని తెలిపారు. ప్రతినిధి శర్మ పాల్గొన్నారు.

1014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles