స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

Mon,May 6, 2019 09:27 PM

by poll for MLC elections in telangana state

హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు మే 31న ఉప ఎన్నికలు జరగనున్నాయి. పట్నం నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా మురళీ రాజీనామాలతో రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు స్థానాలకు మే 31న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి మే 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 17 కాగా, మే 31న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇక కొండా మురళీ తన ఎమ్మెల్సీ పదవికి గతేడాది డిసెంబర్‌లో రాజీనామా చేశారు.

1390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles