డ్రైవర్లు, కండక్టర్ల కోసం మజ్జిగ !

Sat,March 10, 2018 06:22 AM

buttermilk provided to Drivers and conductors in summer duties at telangana

హైదరాబాద్ : నగరంలో ఆర్టీసీ బస్సులు నడుపు తున్న డ్రైవర్లు, కండక్టర్ల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ ప్యాకెట్లను అందిం చనున్నారు. వేసవిలో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత ఇబ్బందులతో బాధ పడుతు న్నారు. బస్సులో కిక్కిరిసిన ప్రయాణికుల మధ్య దాహార్తితో గొంతు ఎండి పోతున్నది. రోడ్లపై బస్సును ఆపి నీరు తాగే పరిస్థితి ఉండదు. బస్సు ఆపితే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కార్మిక సం ఘాలు ఈ అంశాన్ని ఆర్టీసీ ఎండీ రమణారావు దృష్టికి తీసుకువచ్చారు. అం తర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుర్తింపు కార్మిక సంఘం నాయ కుడు, టీ ఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి కూడా సభలో యాజ మాన్యం దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై ఎండీ సానుకూలంగా స్పం దించినట్లు తెలిసింది. నగ రంలోని ప్రధాన కూడళ్ల వద్ద వీటి పంపిణీకోసం బస్ షెల్టర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఆర్టీసీ నియ మించిన సిబ్బంది మజ్జిగ ప్యాకెట్ల తోపాటు నీటి ప్యాకె ట్లను అందచేస్తారని తెలిసింది. ఐతే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉం ది. అవసరం ఉన్నన్నీ ప్యాకెట్లిస్తారా? పరిమిత సంఖ్యలో మజ్జిగ, నీటి ప్యాకె ట్లిస్తారా? అనేది కూడా స్పష్టత రావాల్సిఉంది. ఏ ప్రభుత్వంలో ఇవ్వని విధంగా తెలంగాణ ప్ర భుత్వంలో కండక్టర్లు, డ్రైవర్ల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకోవడం పట్ల పలువు రు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

3890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles