వ్యాపారిని కిడ్నాప్ చేసిన మరో వ్యాపారి

Fri,February 8, 2019 08:58 AM

Businessman kidnap another businessman in Hyderabad

చందానగర్‌ : బకాయిలను వసూలు చేయడానికి..తోటి వ్యాపారిని మరో వ్యాపారి కిడ్నాప్‌ చేశాడు. చితకబాది అనంతరం వదిలేశాడు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌చేయగా, మరి కొం త మంది పరారీలో ఉన్నారు. ఈ సంఘటన చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ కథనం ప్రకారం.. చందానగర్‌, గౌతమీనగర్‌లో నివాసం ఉండే నూకల లక్ష్మణ్‌ స్థానికంగా బం గారం వ్యాపారం చేస్తుంటాడు. వినియోగదారుల వద్ద ఆభరాలకు ఆర్డర్లు తీసుకుని ... బంజారాహిల్స్‌ కేఎల్‌ క్షేత్ర అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటూ చార్మినార్‌లో దుకాణం నడుపుతున్న ధవేశ్‌ అగర్వాల్‌(29)తో చేయిస్తుంటాడు. ఈ క్రమంలోనే గతేడాది 23 తులాలతో కూడిన వడ్డాణం చేసి ఇచ్చేందుకు ధవేష్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దానికి సంబంధించి సగం డబ్బులు ఇచ్చిన లక్ష్మణ్‌... వడ్డాణం తీసుకుని మిగిలిన మొత్తాన్ని ఇవ్వడంలో తాత్సారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆర్థికంగా దెబ్బతిన్న లక్ష్మణ్‌ కొంత కాలంగా వ్యాపారం బంద్‌ చేశాడు. ఈ క్రమంలో బాకీ డబ్బుల విషయంలో ధవేశ్‌, లక్ష్మణ్‌ల మధ్య వివాదం జరుగుతుంది. ఇంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో ధవేశ్‌ అగర్వాల్‌... బుధవారం అర్ధరాత్రి స్నేహితులు మహేశ్‌ అగర్వాల్‌, మహేందర్‌ అగర్వాల్‌, రోహిత్‌, నిషాద్‌లతో కలిసి గౌతమీనగర్‌కు వచ్చారు. బలవంతంగా లక్ష్మణ్‌ను ఇన్నోవాలో ఎక్కించుకుని కూకట్‌పల్లి మెట్రో మార్ట్‌ వద్దకు తీసుకెళ్లి చితకబాదారు.

అక్కడి నుంచి నేరుగా చార్మినార్‌కు తీసుకెళ్లి వదిలేశారు. కాగా... అప్పటికే ఆందోళనలో లక్ష్మణ్‌ భార్య స్వాతి చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చార్మినార్‌లో ధవేశ్‌తో పాటు మహేశ్‌ అగర్వాల్‌, మహేందర్‌ అగర్వాల్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కిడ్నాప్‌నకు ఉపయోగించిన ఇన్నోవాను స్వాధఋనం చేసుకోగా, మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. త్వరలో వారిని పట్టుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపారు.

654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles