ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు

Fri,January 11, 2019 05:59 PM

bus accident in vikarabad dist 15 passengers seriously injured

వికారాబాద్: జిల్లాలోని నవాబుపేట్ మండలం నాగిరెడ్డిపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వికారాబాద్ డిపోకు చెందిన బస్సు అదుపు తప్పి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రులను వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

1502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles