కరెంట్ షాక్‌తో ఎద్దులు మృతి

Sat,January 12, 2019 06:16 PM

bulls killed with current shock in mancherial dandepally

మంచిర్యాల: జిల్లాలోని దండేపల్లి మండలం వెల్లనూరు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మెంగని శంకరయ్యకు చెందిన ఎద్దులు పొలంలో పనిచేస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందాయి. అప్రమత్తమైన రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. మృతి చెందిన ఎద్దుల విలువ రూ.లక్షన్నర ఉంటుందని బాధితుడు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్, రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు. బాధిత రైతు కుటుంబానికి న్యాయ చేస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు.

668
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles