ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తులో అంబేద్కర్ విగ్రహం: సీఎం

Thu,April 14, 2016 02:31 PM

building of 125 feet ambedkar bronze statue cm kcr

హైదరాబాద్: అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఇవాళ నగరంలో పలుచోట్ల అధికారిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ పనులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అద్బుతమైన ప్లాట్‌ఫామ్‌తో ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామన్నారు. ముందు బుద్దుడు తర్వాత అంబేద్కర్ విగ్రహం, వెనకాల సచివాలయం ఉండాలని ఈ స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. హైదరాబాద్‌కు ల్యాండ్ మార్క్‌లా ఉండేలా 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

1745
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles