‘బ్లాక్ చైన్ టెక్నాలజీ’ కోర్సులకు దరఖాస్తులు

Wed,May 29, 2019 06:16 AM

BSNL invites application to black chain technology courses

హైదరాబాద్ : బీఎస్‌ఎన్‌ఎల్ టెలికాం సంబంధించి రెండు కొత్త కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. గచ్చిబౌలిలోని రిజనల్ టెలికాం ట్రైనింగ్ సెంటర్‌లో సీసీఎన్‌ఏ(200-125) కోర్సుకు ఈనెల 25 నుంచి, బ్లాక్ చైన్ టెక్నాలజీ కోర్సులకు రిజిస్ట్రేషన్స్‌ను ఈనెల 31వ తేదీ నుంచి చేసుకోవాల్సి ఉంది. సీసీఎన్‌ఏ(200-125) కోర్సుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌కు రూ.118, కోర్సు ఫీజు రూ.4130 చెల్లించాలి. 30 రోజుల వ్యవధిలో రోజుకు రెండు గంటల పాటు 60 గంటల పాటు ఉంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ కోర్సు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.118తో పాటు రూ.7257 కోర్సు ఫీజు చెల్లించాల్సి ఉంది. 36 గంటల పాటు థియరికల్, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. పూర్తి వివరాలకు 040-23000233/ www.rttchyd.bsnl.co.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

915
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles