బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి సెల్ఫీ సూసైడ్

Mon,July 30, 2018 06:18 AM

bsnl employee selfie suicide in vuyyuru

అమరావతి : ఉయ్యూరులో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి సెల్ఫీ సూసైడ్ కలకలం రేపుతున్నది. వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక చిట్టిబాబు అనే వ్యక్తి అత్యహత్యకు పాల్పాడ్డాడు. ఆత్మహత్య ఘటన గత నెల 29న జరుగగా నెలరోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వడ్డీ వ్యాపారి వద్ద చిట్టిబాబు రూ. లక్ష అప్పు తీసుకున్నారు. నెలకు రూ.16 వేలు వడ్డీ కట్టాలని వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇల్లు అమ్మి వడ్డీ కట్టాలని బలవంతం చేయడంతో సూసైడ్ చేసుకుంటున్నట్టు చిట్టిబాబు సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు.

2479
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS