త్వరలో తెలుగు రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు

Fri,July 21, 2017 10:44 PM

BSNL 4G service to start in ap, telangana soon


హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ త్వరలో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ లో 4జీ సేవలను ప్రారంభించనుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యిందని..ఏపీ, తెలంగాణలో మొత్తం 1150 సైట్స్‌ను నెలకొల్పనున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌ అనంత్‌రామ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

4జీ సేవలకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి ఇప్పటికే ఆదేశాలున్నాయని జనరల్‌ మేనేజర్‌ పి.సుధాకర్‌ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం పదివేల 4జీ సైట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో 550, ఆంధ్రప్రదేశ్‌లో 600 ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

1632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS