పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య

Fri,November 22, 2019 10:52 PM

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ పరిధిలో కాలాపత్తర్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మక్కా కాలనీకి చెందిన అహ్మద్‌ను దుండగులు హత్య చేశారు. అహ్మద్‌పై కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగా హత్య జరిగినట్లు స్థానికుల సమాచారం.

563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles