గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఎలిజబెత్ కోడలు సోఫి హెలెన్

Mon,April 29, 2019 12:50 PM

British Royal Family member tour in Hyderabad

హైదరాబాద్: బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ చిన్నకోడలు, ప్రిన్స్ ఎడ్వర్డ్ భార్య సోఫి హెలెన్ ఈ రోజు గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. గాంధీలోని చిన్న పిల్లల విభాగంలోని ఎన్‌ఐసీయూ, ఇంక్యుబేటర్, ప్రీమెచ్యూర్డ్, ఇన్‌బోర్న్, అవుట్‌బోర్న్ యూనిట్లతోపాటు నియోనెటాలజీ విభాగంలోని పలు వార్డులను సందర్శించారు. గాంధీ ఆస్పత్రిలో ఎలిజబెత్ రాణి (యూకే) ఆధ్వర్యంలో నడిచే డైమండ్ జూబ్లీ ట్రస్ట్ ద్వారా అందుతున్న సేవలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నెలలు నిండకుండా పుట్టిన చిన్నారుల తల్లిదండ్రులతో సోఫి హెలెన్ మాట్లాడారు. ఆమె వెంట దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్, ఇతర డాక్డర్లు వార్డులను తిప్పి చూపించారు.

1250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles