పెండ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుంటే..

Thu,May 9, 2019 05:40 PM

Bridegroom died in peddapally road accident


పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం నీరుకుళ్లలో విషాదం ఘటన చోటుచేసుకుంది. బైకుపై వెళ్తున్న సంతోష్ అనే వ్యక్తి ఇసుక ట్రాక్టర్ ను అధిగమించే ప్రయత్నంలో..ట్రాక్టర్ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంతోష్ తన పెండ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ నెల 15వ తేదీన సంతోష్ వివాహం జరగాల్సి ఉంది. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన సంతోష్ హఠాన్మరణంతో అతని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. సంతోష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

3917
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles