ఇష్టంలేని పెండ్లి చేశారని నవ వధువు ఆత్మహత్య

Tue,May 21, 2019 07:30 AM

bride committed suicide in hyderabad chaderghat police station limits

హైదరాబాద్ : ఇష్టం లేని వివాహం చేశారని... తీవ్ర మనస్తాపానికి గురైన ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. చాదర్‌ఘాట్ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం... పాతమలక్‌పేట సాయిబాబానగర్‌కు చెందిన గుత్తేదారుడు చందు(28)కు, ముషీరాబాద్‌కు చెందిన లక్ష్మీ(22) తో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. కాగా, లక్ష్మీ ఇంట్లోని కిటికీకి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా, లక్ష్మీకి ఇష్టం లేని వివాహం చేశారని మనస్తాపంతో ఆ త్మహత్యకు పాల్పడిందని, తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొంటున్నారు.

3213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles