వేయిస్తంభాల దేవాలయంలో కొనసాగుతున్న బ్రహ్మత్సోవాలు

Sat,April 13, 2019 09:33 PM

Brahmotsavam continue thousand pillar Temple

వరంగల్ : హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణమహోత్సవాలు భాగంగా 8వ రోజు శనివారం విష్ణు ఆలయంలోని ఉత్సవమూర్తులకు విశ్వక్సేనాపూజ, చతుర్వేద మూలమంత్రయుక్త పఠనంతో క్షీరాభిషేకం చేశారు. సుగంధ పరిమలద్రవ్యాలతో విష్ణుమూర్తి ప్రీతికరమైన మల్లెపూలతో పుష్పార్చన నిర్వహించారు. యాగశాలలో నవగ్రహాలకు అధిపతైన ఆ పరమశివునికి ప్రీతికరమైన ప్రకృతిసహజమైన మారేడు కాయలతో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. శ్రీరామనవమి వైష్ణవ సాంప్రదాయప్రకారంగా భద్రాచలక్షేత్రంలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి పూర్ణాహుతి నిర్వహించి శ్రీసీతారాముల కళ్యాణోత్సవ క్రతువును ప్రత్యేక వేదికపై నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.

779
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles