15న బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం

Sun,June 9, 2019 06:21 AM

Brahmins Atmiya Sammelanam on this 15th

హైదరాబాద్ : బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 15వ తేదీన జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులను ఐక్యం చేయాలనే సంకల్పంతో నగరంలోని ఉప్పల్ మేడిపల్లిలోని ఎం.కన్వెన్షన్ హాల్‌లో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సనాతన ఎంటర్‌ప్రెన్యూయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.బి.రామ్, ఉపాధ్యక్షులు శిరీష, సభ్యులు లక్ష్మీ అరుణ, స్వర్ణమంజిర, సూర్యనారాయణ, కృష్ణ, చంద్రమౌళి తెలిపారు. శనివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రాహ్మణులు వ్యాపార రంగంలో నూతన సభ్యులను చేర్చుకోవడం వంటి అంశాలపై ఈ సమ్మేళనంలో చర్చించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కె.వి.రమణాచారి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు హాజరవుతారని తెలిపారు. బ్రాహ్మణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.

1095
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles