బాలుడి కిడ్నాప్ కేసును కొన్ని గంటలలోనే ఛేదించారు

Sun,April 7, 2019 07:12 AM

boy kidnap case was busted within a few hours in hyderabad

చాదర్‌ఘాట్ : ఎనిమిది నెలల బాలుడి కిడ్నాప్ కేసును చాదర్‌ఘాట్ పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే ఛేదించారు. క్షేమంగా బాలుడిని తల్లికి అప్పగించారు. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇన్‌స్పెక్టర్ నాగరాజు కథనం.... ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన ఎం.రోహిని అలియాస్ అస్మాకు మహ్మద్ అస్లాం అనే వ్యక్తితో వివాహం జరిగింది. నెల క్రితమే మహ్మద్ అస్లాం మృతి చెందారు. వీరికి ఎనిమిది నెలల బాలుడు ఉన్నాడు. ఇదిలా ఉండగా, పాతమలక్‌పేట శంకర్‌నగర్‌లో మహ్మద్ అస్లాం తల్లి-తండ్రులు నివాసముంటున్నారు. మహ్మద్ అస్లాం 40 రోజుల చౌలుం కార్యక్రమం నిర్వహించేందుకు అస్మా శంకర్‌నగర్‌లోని అత్తగారి ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి అస్మా లేచి చూడగా బాలుడు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన ఆమె ఇంట్లో వారందరిని నిద్రలేపి చుట్టూపక్కల వాకబు చేసినప్పటికి ఫలితం ఆచూకీ దొరకలేదు. దీంతో బాధితులు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ నాగరాజు, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. దర్యాప్తులో భాగంగా అస్మాబావ అక్రం బాలుడ్ని కిడ్నాప్ చేసి ఉండవచ్చునని సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టడంతో అక్రం తన చెల్లెలు హసీనాతో కలిసి బాలున్ని కిడ్నాప్ చేసినట్లు అంగీకరించారు. బాలున్ని అవసరమైన వారికి విక్రయించేందుకు పథకం రూపొందించారని, ఇందుకు బొల్లారంలోని వారి బంధువుల ఇంటికి బాలున్ని తరలించారు. ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి సమాచారం మేరకు హుటాహుటిన బొల్లారంలో బాలుడు ఉన్న నివాసానికి వెళ్లి క్షేమంగా తిరిగి తీసుకొచ్చారు. బాలున్ని తల్లి అస్మాకు అప్పగించి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు.

1691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles