రైలు ఢీకొని బాలుడి మృతి

Tue,December 3, 2019 09:48 PM

కాచిగూడ: ఫలక్‌నుమా, బుద్వేల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటన జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫాతిమానగర్‌కు చెందిన సాదత్ కుమారుడు సయ్యద్ అబ్దుల్ రహమాద్(11) స్థానిక పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్నాడు. పతంగి ఆడుకుంటూ ఫలక్‌నుమా, బుద్వేల్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా, అదే సమయంలో అతడిని రైలు ఢీకొంది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందడంతో సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles