ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి.. సగం వాడిన మందును మళ్లీ వాడడంతో ప్రమాదం

Wed,February 20, 2019 10:51 PM

కోదాడ: జ్వరం ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కాపుగల్లులో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బాడిశ నర్సింహారావు కుమారుడు కార్తీక్(5)కు గత నెల రోజుల క్రితం డెంగ్యూ జ్వరం వచ్చి తగ్గిపోయింది. బుధవారం నర్సింహారావు ఓ ఫంక్షన్ వెళ్లవలసి ఉంది.


చిన్నారికి జ్వరం లక్షణాలు కనిపించడంతో తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న స్థానిక వైద్యుడిని పిలిచి గతంలో వాడగా మిగిలిన ఇంజక్షన్‌ను వేయమని చెప్పడంతో వైద్యుడు ఆ ఇంజక్షన్ చేసి వెళ్లిపోయాడు. దీంతో కొద్దిసేపటికి బాలుడి ఒంటి నుంచి వేడిసెగలు రావడంతోపాటు మెలికలు తిరుగుతుండటంతో తల్లిదండ్రులు బాలుడిని గ్రామంలోని మదో వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు.

బాలుడి తీరు పరిశీలించి వెంటనే కోదాడ పెద్ద దవాఖానకు తరలించాలని సలహా ఇవ్వడంతో ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బాలుడికి రెండు రోజులుగా జలుబు, జ్వరం ఉండడంతో అదే ఇంజక్షన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి స్థానిక వైద్యుడితో ఇప్పిస్తున్నారు. బుధవారం అనుకోకుండా ఈ ఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురై కన్నీటి పర్యంతమయ్యారు.

2722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles