ప్రేమించిన అమ్మాయి ఫోన్ చేసి వేధిస్తుండటంతో...

Tue,March 26, 2019 08:10 AM

boy attempts suicide in langar house police station

మెహిదీపట్నం : ప్రేమించిన అమ్మాయి ఫోన్ చేసి వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పోలీస్‌స్టేషన్‌లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించు కున్నాడు. రాత్రి లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. సకాలంలో స్పందించిన పోలీసులు మంటలను ఆర్పి ఆ యువకుడిని ఉస్మానియా దవాఖానకు తీసుకువెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే..... లంగర్‌హౌస్ గొల్లబస్తీలో నివసించే ఆదిల్(25) డీఎల్‌ఎఫ్‌లో పని చేస్తున్నాడు. ఇతను క్లాస్‌మేట్ అయిన యువతి (23)ని నాలుగు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఆ యువతి... అతనికి ఫోన్‌చేసి దూషించింది.

ఆ యువతి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన ఆదిల్ రాత్రి లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చే ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని వచ్చాడు. రిసెప్షన్‌లో పోలీసుకులకు దరఖాస్తు ఇస్తూనే ఒంటికి నిప్పంటించుకున్నాడు. పోలీసులు వెంటనే మంటలను ఆర్పారు. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

3346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles