శుభకార్యాలకు రైలు బుక్‌చేసుకోండిలా!

Fri,November 24, 2017 07:22 AM

book train coach for marriage

హైదరాబాద్ : పెండ్లీలు, పేరంటాలు, ఇతరత్రా శుభకార్యాలు, పర్యాటక ప్రాంతాలకు కుటుంబం, బంధుమిత్రులు మొత్తం ఒకే రైలు బోగీలో వెళ్లాలనుకుంటున్నారా? లేదా 24 బోగీలను బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ సేవలు ఆన్‌లైన్‌లో పొందేందుకు అవకాశం కల్పించింది ఇండియన్ రైల్యే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ). ప్రయాణికులకు టికెట్ కొనుగోలు నుంచి అనేక సేవలను ఐఆర్సీటీసీ ఇటీవల మరింత విస్తృత పరిచింది.

నెల ముందుగా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో ప్రయాణ తేదీ, సంబంధిత రూట్, బోగీల సంఖ్య నమోదు చేసుకోవాలి. కనీసం ఏడురోజుల వ్యవధిలో బోగీని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో బోగీకి రూ.50 వేలు చెల్లించాలి. రైలును బుక్ చేసుకోవాలంటే ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ గానీ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలోగానీ సంప్రదించాలి. నగదు చెల్లించిన తర్వాత అనుకోకుండా ప్రయాణం రద్దయితే సికింద్రాబాద్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌ను కలిసి కారణాలు వివరించి డబ్బులు వెనుకకు పొందే వెసులుబాటును కూడా ఉన్నది. రైలు ప్రయాణికులు నచ్చిన ఆహారం కోసం ఫోన్ నుంచి మీల్ పీఎన్‌ఆర్ అని టైప్‌చేసి 1398కి సంక్షిప్త మెసేజ్ పంపించి ఐఆర్సీటీ ద్వారా సీటు వద్దకే వేడివేడి భోజనం తెప్పించుకోవచ్చు.

రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల నుంచి తీసుకునే టికెట్లు కూడా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ ద్వారా రద్దు చేసుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తోపాటు డివిజన్ పరిధిలోని ఇతర స్టేషన్లలో ఉన్న విశ్రాంతి గదులను నేరుగా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు.

1735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS