గుండెపోటుతో జీహెచ్‌ఎంసీ మేయర్ సోదరి మృతి

Fri,October 12, 2018 09:23 PM

bonthu rammohan sister dies of heart attack

రాయపర్తి: హైదరాబాద్ మహా నగర మేయర్ బొంతు రాంమోహన్‌ సోదరి సునీత‌(38) వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని మొరిపిరాల గ్రామంలోని తన ఇంట్లో శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. సునీత‌ మరణవార్త తెలుసుకున్న మేయర్ బొంతు రాంమోహన్‌ వెంటనే మొరిపిరాల గ్రామానికి చేరుకుని సోదరి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. బొంతు రాంమోహన్‌ సోదరి సునీత‌ మరణవార్త తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్రంలోని పలు కార్పోరేషన్‌ల చైర్మన్‌లు లింగంపల్లి కిషన్‌రావు, నాగుర్ల వెంకటేశ్వర్లు, వాసుదేవరెడ్డి మృతురాలి నివాసానికి చేరుకుని సునీత‌ భౌతిక కాయంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించి బొంతు రాంమోహన్‌, మృతురాలి భర్త యాకూబ్‌, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సునీత‌ అకాల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

9117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS