బొగత జలపాతం సవ్వళ్లు షురూ..

Wed,June 13, 2018 02:25 PM

Bogatha Waterfalls Telangana

జయశంకర్ భూపాలపల్లి : వాజేడు మండలం చీకుపల్లి అడవిలోని తెలంగాణ నయాగర బొగత జలపాతం సవ్వళ్లు షురూ అయ్యాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ర్టంలోని జలపాతాలకు వరద పోటెత్తింది. ప్రకృతి పులకింతల మధ్య ఈ జలపాత హోయలను ఆస్వాదించొచ్చు. ప్రకృతి సౌందరాన్ని చూసి పరవశించొచ్చు. ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం ఇది. ప్రకృతి సష్టించిన అద్భుతమైన అందాల్లో ఈ జలపాతం ఒకటి. మరికొద్ది రోజుల్లో బొగత జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్తగా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

బొగత జలపాతాన్ని చేరుకునేది ఎలా...
ఖమ్మానికి 240 కిలోమీటర్లు. భద్రాచలం నుంచి 120కి.మీ., హైదరాబాద్‌కైతే 274 కిలోమీటర్ల దూరం(వయా వరంగల్). హైదరాబాద్ నుంచి పర్యాటకులు రైలు, రోడ్డు మార్గం ద్వారా బొగత జలపాతానికి చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం వరకు సౌకర్యం ఉంది. కొత్తగూడెం నుంచి భద్రాచలం మీదుగా వాజేడు మండల కేంద్రానికి రోడ్డు మార్గాన చేరుకోవాలి. అక్కణ్ణుంచి 5కిలోమీటర్ల దూరంలో చీకుపల్లి కాజ్‌వే ఉంటుంది. అక్కడి నుంచి మరో కిలోమీటరు ముందుకు వెళ్లాలి. ఎడమవైపు తిరిగి రెండు కిలోమీటర్లు మట్టిరోడ్డున వెళ్తే అందాల బొగత దర్శనమిస్తుంది.

3277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS