బొగ‌త అందాలు చూడత‌రమా...!

Sun,July 8, 2018 05:17 PM

bogatha waterfalls in bhupalpally

భూపాలపల్లి: జయశంకర్‌ జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం అందాలు పర్యాటకులను ఆక‌ట్టుకుంటుంది. గ‌త కొద్దిరోజులుగా కురుస్తున్న‌ వర్షాలకు జల ధారలు ఉవ్వెత్తున ప్రవహిస్తుండడంతో ప్రకృతి ప్రేమికులు మంత్రముగ్థులవుతున్నారు. ఛ‌త్తీస్‌గ‌డ్‌ రాష్ట్ర కొండలను దాటుకుంటూ నల్లందేవీ వాగు మీదుగా బొగత వద్ద 50 అడుగుల ఎత్తు నుంచి దుముకుతున్న జలధారలను చూసేందుకు ఆదివారం జనాలు క్యూ కట్టారు. ప్ర‌స్తుతం ఆ ప్రాంత‌మంతా సంద‌ర్శ‌కుల‌తో సంద‌డి వాతావార‌ణం నెల‌కొంది. బొగత జలపాతం వద్దనే నరసింహస్వామి పుణ్యక్షేత్రం ఉంది. ప్రతి అదివారం ఇక్కడికి వందలాదిమంది భక్తులు వస్తుంటారు. మామూలు రోజుల్లో విహారయాత్రికుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నా సెలవుదినాల్లో రద్దీ ఎక్కువ.


బొగత జలపాతానికి వెళ్లేందుకు రూట్ ఇదీ..

హైదరాబాద్ నుంచి పర్యాటకులు రైలు, రోడ్డు మార్గం ద్వారా బొగత జలపాతానికి చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం వరకు సౌకర్యం ఉంది. కొత్తగూడెం నుంచి భద్రాచలం మీదుగా వాజేడు మండల కేంద్రానికి రోడ్డు మార్గాన చేరుకోవాలి. అక్కణ్ణుంచి 5కిలోమీటర్ల దూరంలో చీకుపల్లి కాజ్‌వే ఉంటుంది. అక్కడి నుంచి మరో కిలోమీటరు ముందుకు వెళ్లాలి. ఎడమవైపు తిరిగి రెండు కిలోమీటర్లు మట్టిరోడ్డున వెళ్తే అందాల బొగత దర్శనమిస్తుంది.

3778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles