ఎల్‌ఎండీలో బోటింగ్ ప్రారంభం

Sat,January 12, 2019 10:03 PM

Boating start lower manair dam

కరీంనగర్ : కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యాంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్‌ను స్థానిక ఎంపీ వినోద్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావులతో కలిసి బోట్‌లో విహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న డ్యాంను పూర్తిస్థాయిలో పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాకు దగ్గరలోనే చుట్టూ పుణ్యక్షేత్రాలు ఉన్నాయనీ, అక్కడికి వచ్చే వారు కరీంనగర్‌లో ఒక్క రోజు ఉండే విధంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే పనులను చేపట్టేందుకు చర్యలు చేపడుతామన్నారు. అనంతరం ఐటీ టవర్ పనులను ఆయన పరిశీలించారు.

అధికారులు, కాంట్రాక్టర్ల నుంచి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేగంగా పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, సునీల్‌రావు, అజిత్‌రావు పాల్గొన్నారు.

745
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles