సోదరుడి హత్యకు ప్రతీకారంగా...

Sun,October 13, 2019 06:53 AM

హైదరాబాద్ : మూడేండ్ల క్రితం జరిగిన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.. సమయం కోసం వేచిచూసి అందరూ చూస్తుండగానే కత్తితో నిందితుడిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపర్చి పరారయ్యాడు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... పాతమలక్‌పేట ప్రాంతానికి చెందిన అఫ్జల్ సిద్ధిఖీ 2016 అక్టోబర్ 14న బీబీ క్యాన్సర్ దవాఖాన సమీపంలో నివాసముండే అబ్దుల్ రహ్మాన్ అలియాస్ అబ్బూ హత్య కేసులో నిందితుడు. కాగా.. వీరిద్దరు స్నేహితులు. అప్పట్లో డబీర్‌పురా వద్ద స్వల్ప విషయమై వీరిలో గొడవ చోటుచేసుకుంది. ఆ తరువాత ఆజంపురా షహీఫా మసీదు వద్ద ఘర్షణ పడ్డారు.


దీంతో సిద్ధిఖీ కత్తితో అబ్దుల్ రహ్మాన్‌పై దాడిచేయగా మృతి చెందాడు. అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న రహ్మాన్ సోదరుడు రాఫే అందరూ చూస్తుండగానే అఫ్జల్ సిద్ధిఖీ పై కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. అఫ్జల్ సిద్ధిఖీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అడిషనల్ డీసీపీ, సుల్తాన్‌బజార్ ఏసీపీ లు ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సోదరుడి మృతి పై ఆరా తీస్తూ...
అబ్దుల్ రహ్మాన్‌ను అఫ్జల్ సిద్ధిఖీ కత్తితో దాడి చేసి సోమవారంతో మూడేళ్లవుతుంది. అబ్దుల్ రహ్మాన్ హత్యోదంతం పై తరచూ పోలీస్‌స్టేషన్ లో వాకబూ చేస్తూ... అఫ్జల్ సిద్ధిఖీకి శిక్ష ఖరారు అవుతుందా? లేదా? అనే వాటి పై ఆరా తీసినట్లు తెలిసింది. మూడేండ్లయిన అఫ్జల్ సిద్ధిఖీకి ఇంకా శిక్ష ఖరారు కాకపోవడంతో ప్రతీకార దాడితో రాఫే ఈ హత్య చేసి ఉండవచ్చునని పలువురు భావిస్తున్నారు. అఫ్జల్ సిద్ధిఖీ కదలికలను గమనిస్తూ తన సోదరుని హత్య చేసిన చోటే రాఫే కత్తితో దాడి చేయడం చర్చనీయాంశమయ్యింది. అఫ్జల్ సిద్ధిఖీ షహీఫా మసీదు వద్ద ఉన్న బ్యాంక్ నుంచి నగదు తీసుకునేందుకు రావడాన్ని గమనించి విచక్షణారహితంగా రాఫే కత్తితో దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు. రాఫేతో పాటు అతని స్నేహితులు కూడా ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.

1585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles