చంద్రబాబు.. స్టిక్కర్ బాబుగా మారారు..!

Fri,February 22, 2019 02:12 PM

BJP mp GVL Narasimha Rao Slams AP CM Chandrababu Naidu

విజయవాడ: రాష్ర్టానికి సంబంధించిన నిధుల విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కేంద్రం రూ.ఐదున్నర లక్షల కోట్లు రాష్ర్టానికి సాయం చేస్తే.. చంద్రబాబు వాటికి లెక్కలు చెప్పడం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నర్సింహారావు అన్నారు. కేంద్రం చేసే పనులు చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. జీవీఎల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు.. స్టిక్కర్ బాబుగా మారారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కనుమరుగవడం ఖాయం. పది నెలలుగా టీడీపీ అబద్ధాల రాజకీయాలు చేస్తోంది. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఛీ కొట్టి టీడీపీని వీడుతున్నారని పేర్కొన్నారు.

1265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles