రేవంత్‌రెడ్డిపై ఐటీ రిపోర్ట్ బయటకు..

Sat,October 20, 2018 12:27 PM

BJP MP GVL Narasimha Rao Fires on congress,tdp

హైదరాబాద్: టీడీపీ, కాంగ్రెస్ నేత‌ల‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఫైర్ అయ్యారు. ఐటీ సోదాలతో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అసలు స్వరూపం బయటపడిందని జీవీఎల్ తెలిపారు. రేవంత్‌రెడ్డిపై ఐటీ రిపోర్ట్ బయటకు వచ్చిందని ఆయన చెప్పారు. ల్యాండ్ సెటిల్‌మెంట్, కబ్జాలతో రేవంత్‌రెడ్డి కోట్లు సంపాదించారని ఆరోపించారు. సెటిల్‌మెంట్లతో రూ.11కోట్ల నల్లధనం వచ్చిందని రేవంత్‌రెడ్డి బావమరిది చెప్పారని వివరించారు. రేవంత్‌రెడ్డి మామ దగ్గర 11 లక్షలు, బావమరిది దగ్గర 1.2 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారన్నారు. కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డి దగ్గర రూ.1.40కోట్లు దొరికాయన్నారు. కేఎల్‌ఎస్‌ఆర్ సంస్థ బినామీ సంస్థగా తేలిపోయిందన్నారు.

రేవంత్‌రెడ్డి సోదరుడి కంపెనీ భూపాల్, ఇన్‌ఫ్రాటెక్ సబ్ కాంట్రాక్టు పనులు చేసింది. కేఎల్‌ఎస్‌ఆర్ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టు పనులు తీసుకున్నారని జీవీఎల్ వెల్లడించారు. కూలీలకు డబ్బులు ఇచ్చామని అనేక రెట్లు పెంచి చూపించాడని పేర్కొన్నారు. కేఎల్‌ఎస్‌ఆర్ సంస్థ రూ.20కోట్ల బోగస్ కాంట్రాక్టులు చూపుతోందని అన్నారు. భూలావాదేవీలతో నల్లధనాన్ని సంపాదించి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డాడు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కుంభకోణానికి పాల్పడ్డాడని తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనా కబ్జాల ఆరోపణులున్నాయని జీవీఎల్ తెలిపారు. నేషనల్ హెరాల్డ్ సంస్థకు ఇచ్చిన భూముల్లో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తముడేమీ కాదని విమర్శించారు. భూకబ్జాదారులను వెనకేసుకొచ్చి తప్పు చేసిన ఉత్తమ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటే 'ఇమ్మోరల్ నేషనల్ కరప్ట్ కాంగ్రెస్' అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో దందాలు చేసేవారికి మంచి గుర్తింపు ఉంటుందని జీవీఎల్ మండిపడ్డారు.

5686
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS