కిషన్‌రెడ్డికి మాతృవియోగం.. సీఎం కేసీఆర్ సంతాపం

Thu,April 25, 2019 12:27 PM

BJP leader Kishan Reddy mother died

హైదరాబాద్: బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఇంట విషాదం నెలకొంది. కిషన్‌రెడ్డి తల్లి గంగాపురం అండాలమ్మ(80) అనారోగ్యంతో కన్నుమూశారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురులో అంత్యక్రియలు జరగనున్నాయి. కిషన్‌రెడ్డి తల్లి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుతున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

1480
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles