అవమానాలే.. అందలమెక్కించాయి: బిత్తిరిసత్తి( చేవెళ్ల రవి)

Fri,June 17, 2016 03:00 PM

bithiri sathi special interview

పాలమూరు : చిన్నప్పటి నుంచి అవమానాలు.. చీత్కారాలు.. అనుభవించా.. పెద్దాయ్యాక నాకు ఆసక్తి ఉన్న డబ్బింగ్ రంగంలోనైనా రాణించాలని ఆశపడ్డ. కాని ప్రతి చోట నాకు అవమానాలే.. తెలంగాణ భాష.. యాసను అప్పట్లో ఆంధ్రోళ్లు చిన్నచూపు చూచినట్లే నన్ను చిన్నచూపు చూశారు. నేలకేసి కొట్టిన బంతిలా.. కసిగా ప్రయత్నించి ఇప్పుడు అందరి అభిమానాన్ని చూరగొనగలిగానుఅని టీవీ యాంకర్‌గా, న్యూస్ రీడర్‌గా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న బిత్తిరిసత్తి అలియాస్ చేవెళ్ల రవి అన్నారు. జిల్లా కేంద్రం లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బిత్తిరిసత్తి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ...

మాది రంగారెడ్డి జిల్లా.. చేవెళ్ల మండలంలోని పామెన గ్రామం. మా అమ్మానాన్నలు నర్సింహులు, యాదమ్మ. మా తల్లిదండ్రులకు మా అక్క, నేను ఇద్దరమే సంతానం. మా నాన్న కావలికారు కావడంతో ప్రతి రోజు ఆయన వెంట చిన్నప్పటి నుంచి ఇంటింటికి తిరిగేవాడిని. ప్ర తి ఇంట్లో రకరకాల మనస్తత్వాలు ఉన్న మనుషుల్ని చూసి వారి హవాభావాలు, మనస్తత్వాలను అర్థం చేసుకొని ప్రతి రోజు వారిని అనుకరిస్తూ మాట్లాడేటోన్ని. 6వ తరగతికి వచ్చేసరికి పాటలు, మాటలతో మా తరగతిలోని వాళ్లందరిని నవ్వించేటోన్ని. 5వ తరగతి వరకు మా ఊళ్లోనే చదువుకున్న తర్వాత మా ఊరికి 10 కి.మీ.ల దూరంలో ఉన్న చెన్వెల్లికి ప్రతి రో జు నడుచుకుంటూ వెళ్లి 10వ తరగతి వరకు చదువుకున్నా. ఇంటర్మీడియట్‌ను చేవెళ్లలో చదివినా. పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పోటీలలో పాల్గొనేటోన్ని. గప్పట్ల స్నేహితులు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లేకుంటే సినిమా నటునిగా నీవు రాణిస్తావని చెప్పిండ్రు. అప్పటి నుంచి ప్ర తి రోజు మా ఊరి నుంచి హైదరాబాద్‌కు వెళ్లి సినిమాలు, టీవీలలో నటించేందుకు ప్రయత్నించినా, కాని ఎక్కడికెళ్లినా.. నాకు అవమానాలు తప్పలేదు.

ఈ సమయంలోనే నాకు వివాహమైంది. అయినా ఓ వైపు కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేస్తూనే మరో వైపు నా ప్రయత్నాలను మానలేదని ఆయన పేర్కొన్నారు. అవమానం జరిగిన ప్రతి సారీ కళ్లలో నీళ్లు తిరిగేవి. 15 ఏళ్లు అవమానాలు, కష్ట నష్టాలను భరించి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అవకాశం పొందాను. మొ దట్లో చిన్న చిన్న అవకాశాలొచ్చాయి. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో టీవీ ఛానళ్లలో తెలంగాణ భాషకు ప్రాధాన్యత వచ్చింది. మొదట్లో 6 టీవీలో నర్సయ్య తాతగా పనిచేశాను. తర్వాత వీ6 లో బిత్తిరి సత్తిగా పరిచయమయ్యా. ఇక అక్కడి నుం చి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రతి రోజు సినిమా, టీవీ అవకాశాలు ఎన్నో వస్తున్నాయి. కొన్నింటిని మాత్రమే ఎంపిక చేసుకొని నటిస్తున్నానని బిత్తిరి సత్తి తెలిపారు. అప్పట్లో అవమానాలు ఎదుర్కొన్న చోటే ఎంతో మంది ఆదరాభిమానాలను పొందగలుగుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

నాకు జన్మనిచ్చిన మా అమ్మానాన్నలకు.. నా పుట్టిన ఊరుకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను అని సత్తి వివరించారు. నేటి యువత ని రాశ, నిస్పృహలకు గురికాకుండా లక్ష్యాలను ఎంపిక చేసుకొని సాధించే వరకు కృషి చేస్తే ఏదో ఒక రోజు మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామన్నది నిజమన్నారు. ఓటములు, అవమానాలు ఎదురైన ప్రతిసారి నేలకు కొట్టినా బంతిలా మరింత ఉత్సాహంగా కృషి చేస్తే లక్ష్యాలను సులభంగా చేరుకుంటామని బిత్తిరి సత్తి తెలిపారు.

14046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS