కేటీఆర్‌కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు

Tue,July 24, 2018 07:15 AM

Birth day wishes to Minister KTR

కేపీహెచ్‌బీ కాలనీ(హైదరాబాద్) : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని విభిన్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు ఆయన అభిమానులు. కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ యువజన నాయకుడు పాటిమీది జగన్ మోహన్‌రావు ఆధ్వర్యంలో ఐటీ ఉద్యోగులు, సిరిసిల్ల చేనేత, విభిన్న రంగాలకు చెందిన సుమారు 712 మంది కేటీఆర్ ముఖ చిత్రం ఆవిష్కృతమయ్యేలా నిలబడ్డారు. దేశంలో మొదటి సారిగా కేటీఆర్ 600 అడుగుల ముఖ చిత్రాన్ని ఆవిష్కరించడం విశేషమని, ప్రపంచంలో నెల్సన్ మండేలా తరువాత ఈ తరహాలో ముఖ చిత్రం కేటీఆర్‌దే ఆవిష్కరించినట్లు నిర్వాహకుడు జగన్ తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు వాడొద్దన్న కేటీఆర్ సూచన మేరకు వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అనంతరం కేటీఆర్‌పై ప్రత్యేక గీతాన్ని సైతం రూపొందించి, విడుదల చేశారు.

3619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles