ఈనెల 24న ప్రధాని మోదీ బయోపిక్ విడుదల

Fri,May 3, 2019 10:15 PM

Biopic on PM Modi to release on May 24

ముంబై : ప్రధాని నరేంద్రమోదీ జీవితం కథాంశంగా తెరకెక్కనున్న పీఎం నరేంద్రమోదీ సినిమాను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ బృందం వెల్లడించింది. ఈనెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని, ఆ మరుసటి రోజే ప్రధాని మోదీ బయోపిక్‌ను విడుదల చేస్తామని తెలిపింది. వాస్తవానికి ఈనెల 11న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నామని, అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విడుదల చేయవద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశించిందని పేర్కొంది. ఈ సినిమా నిర్మాత సందీప్ ఎస్ సింగ్ మాట్లాడుతూ సినిమా విడుదల అనంతరం ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సవ్యంగా నడుస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని చెప్పారు. ఎన్నో చర్చల అనంతరం ఎన్నికల ఫలితాల మరుసటి రోజే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు. కాగా ఈ సినిమాలో మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించారు.

727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles