పీహెచ్‌సీలలో బయోమెట్రిక్ అటెండెన్స్

Sat,May 11, 2019 06:38 AM

biometric attendance in primary health centre

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో సర్కారు వైద్యసేవలను మరింత పటిష్ఠం చేస్తున్నారు. ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లాస్థాయి దవాఖానలు, సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలందించే దవాఖానలు అన్నింటిలోనూ పేదలకు మెరుగైనవైద్యం అందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ప్రైవేట్‌కు దీటుగా సర్కారు దవాఖానలను తీర్చిదిద్దేందుకు 11 అంశాలపై దృష్టిపెట్టారు. ప్రభుత్వ దవాఖానల పరిసరాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పి ఆహ్లాదకర పరిస్థితులను కల్పిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) నుంచి సూపర్‌స్పెషాలిటీ దవాఖానల వరకు అక్కడ పనిచేస్తున్న వైద్యులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. పీహెచ్‌సీల పరిధిలో బయోమెట్రిక్ హాజరువిధానాన్ని అమలుచేయాలని వైద్యశాఖ భావిస్తున్నది. పీహెచ్‌సీల పరిధిలో 24గంటలు వైద్యం అందిచడంపై దృష్టిపెట్టారు. సర్కారు దవాఖానల్లో మంచినీటిని అందించాలని నిర్ణయించారు. ఆయా దవాఖానల్లో నీటి కొరతను అధిగమించేందుకు మిషన్ భగీరథ పథకంతో అనుసంధానం చేస్తున్నారు. మంచినీటి కొరత తీర్చగలిగితే వైద్యశాలలకు వచ్చే రోగులకు అవస్థ తొలగడంతోపాటు పరిశుభ్రత కూడా మెరుగుపడుతుందని వైద్యశాఖ భావిస్తున్నది.

1090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles