టీ-సాట్‌లో జీవశాస్త్ర ప్రసారాలు

Fri,July 12, 2019 06:32 AM

Biological Lessons in T SAT

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మధ్యా హ్నం 2 గంటల నుంచి 3.30 వరకు టీ-సాట్‌లో జీవశాస్త్ర అభ్యసనంపై ప్రసారం అవుతుందని, జిల్లా విద్యాశాఖాధికారులు, అధికారులు, ప్రధానోపాధ్యాయులు తప్పకుండా వీక్షించాలని ఎస్సీఈఆర్టీ సంచాలకులు బీ శేషుకుమారి తెలిపారు. 6-10 తరగతుల విదార్థులు కూడా కార్యక్రమాన్ని వీక్షించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జీవశాస్త్రానికి చెందిన నిపుణులతోపాటు విద్యారంగ, బోధన నిపుణుల సహకారంతోప్రసారాలు కొనసాగుతాయని చెప్పారు. నిపుణ చానల్, టీ-సాట్ యాప్, యూట్యూబ్, కేబుల్ కనెక్షన్ ద్వారా కార్యక్రమాన్ని చూడవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం 040-23553473, 1800-425- 4038 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles