పెట్రోల్ కు బదులు నీళ్లు..వాహనదారుల ఆందోళన..వీడియో

Mon,July 22, 2019 09:50 PM

bikers protest against chatanyapuri hp petrol bunk with waterpetrol


హైదరాబాద్: చైతన్యపురిలోని హెచ్ పి పెట్రోల్ బంక్ లో వాహనదారులు పెట్రోల్ కొనుగోలు చేశారు. అయితే బంక్ లో నుంచి పెట్రోల్ కు బదులుగా నీళ్లు వస్తున్నాయంటూ కొంతమంది వాహనదారులు హెచ్ పీ పెట్రోల్ బంక్ ఎదుట ఇవాళ ఆందోళనకు దిగారు. ఇవాళ ఉదయం నుంచి పెట్రోల్ కొట్టించుకున్న వారిలో కొంతమంది వ్యక్తులు వాటర్ బాటిళ్లలో పెట్రోల్ తో బంక్ దగ్గరకు వచ్చి ఆందోళన చేపట్టారు. వాహనదారులు తీసుకొచ్చిన బాటిళ్లలో నీరు, పెట్రోల్ కలిసి ఉన్నట్లు కనిపిస్తోంది. బంక్ సిబ్బంది తమ వాహనాల్లో పెట్రోల్ కు బదులు నీళ్లు కొట్టారని వాహనదారులు బంక్ ముందు ఆందోళనకు దిగారు.

వాహనదారులు బాటిళ్లు పట్టుకుని బంక్ వద్దకు రావడంతో బంక్ యాజమాన్యం అక్కడ నుంచి పరారయ్యారు. ఇదే బంక్ లో గతంలో కూడా ఇదే రీతిలో పెట్రోల్ కు బదులు నీళ్లొచ్చాయని, ఇదే విషయంపై ప్రశ్నిస్తే ఎవరూ స్పందించడం లేదని బాధితులు ఆవేదక వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ కు బదులు నీళ్లు వస్తుండటంతో వేలు ఖర్చు పెట్టి కొనుక్కున్న వాహనాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు. బంక్ యజమానులపై చర్యలు తీసుకోవాలని బాధితులు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సమాచారమందుకున్న పోలీసులు బంక్ వద్దకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వాహనదారులు చెబుతున్న విషయాలను పరిగణలోకి తీసుకుని..ఈ ఘటనపై విచారణ చేపడుతామని, తప్పు చేసినట్లు రుజువైతే కఠినచర్యలు తీసుకోనున్నసట్లు పోలీసులు ఉన్నతాధికారులు చెప్పారు.

2311
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles