నాడు ఉపసర్పంచ్...నేడు ద్విచక్ర వాహనాల దొంగWed,November 15, 2017 12:49 AM
నాడు ఉపసర్పంచ్...నేడు ద్విచక్ర వాహనాల దొంగ

మారేడ్‌పల్లి : ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న మాజీ ఉప సర్పంచ్‌ను, అతనికి సహకరించిన మరో వ్యక్తిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 10 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డీసీపీ బి.సుమతి కథనం ప్రకారం... సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మండలం, పందిల్లాకు చెందిన అలుమల్లా విజయేందర్‌రెడ్డి అలియాస్ రాజు (35) మాజీ ఉప సర్పంచ్. పదవీ కాలం అనంతరం కాంట్రాక్టు పనుల్లో నష్టం రావడంతో డబ్బుల కోసం ద్విచక్రవాహనాలను దొంగిలించడం మొదలుపెట్టాడు. నగరంలో పలుచోట్ల వాహనాలు దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదుతో ఈ నెల 13న విజయేందర్‌రెడ్డిని మార్కెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చేసిన చోరీలను ఒప్పుకున్నాడు. ఇప్పటి వరకు 24 ద్విచక్రవాహనాలను దొంగిలించించగా...10వాహనాలు రికవరీ చేశారు. అలాగే విజయేందర్‌రెడ్డి దొంగిలించిన వాహనాలను అమ్మేందుకు సహకరించిన కరీంనగర్ జిల్లా కశ్మీర్‌గడ్డ ప్రాంతానికి చెందిన ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఎండి. యూన స్ (35)ను కూడా అరెస్టు చేశారు.

929
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS