బైక్ దొంగల ముఠా అరెస్ట్

Tue,January 22, 2019 09:31 PM

bike Gang of thieves arrested in rajanna sircilla

సిరిసిల్ల : జిల్లా కేంద్రమైన రాజన్న సిరిసిల్లలో బైక్ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల తో నిందితులను పట్టుకున్నామని , ఆదిలోనే దొంగతనాలను అరికట్టినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. ఈమేరకు ఏడుగురు నిందితులను సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆరెస్ట్ చూపించారు. వివరాలను వెల్లడించారు. సిరిసిల్లలోని బీవైనగర్‌కు చెందిన అడెపు రవికుమార్, ఆడెపు రాజు, సుందరయ్యనగర్‌కు చెందిన తలకొక్కుల సతీష్, శాంతినగర్‌కు చెందిన అకునూరి అఖిల్ సామస్సన్, జేపినగర్‌కు చెందిన గుజ్జె ప్రవీణ్, కరీంనగర్‌లోని రాంనగర్‌కు చెందిన గాలి మధు,కరీంనగర్‌లోని కొత్తపల్లికి చెందిన ఎండీ అసిఫ్‌ఖాన్‌లతో పాటు నలుగురు మైనర్లు సిరిసిల్లలోని బీవైనగర్‌కు చెందిన కోడం వంశీకృష్ణ, కరీంనగర్ మండల కొత్తపల్లికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్, కరీంనగర్ జిలా ఎలగందుల కు చెందిన ఎండీ అస్లామ్ గఫుర్, కరీంనగర్ జిల్లా బావుపేటకు చెందిన ఎండీ సోహెల్‌లు జల్సాలకు అలవాటు పడి, దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ముందుగా పెట్రోల్ దొంగతనం చేస్తుంటారు. పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను పగటి పూట రెక్కి నిర్వహించి, చోరీలకు పాల్పడుతుండగా, సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నామన్నారు. వీరిని సిరిసిల్లలోని కొత్త చెరువు ప్రాంతంలో వాహన తనిఖీల్లో పట్టుకున్నామని, 8 బైక్‌లు, 1టీవీఎస్ మోపెడ్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటి విలువు సుమారు రూ.7లక్షల వరకు ఉంటుందన్నారు. నిందితుల్లో ఏడు గురు 21 ఏళ్లలోపే ఉండగా, మరో నలుగురు మైనర్లు ఉన్నారు. సిరిసిల్ల డీఎస్పీ వెంకటరమణ,సిఐ అనిల్‌కుమార్,ఎస్‌ఐ శ్రీనివాసరావుతోపాటు సిబ్బంది ఉన్నారు.

1580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles