రైలు నుంచి జారిపడి బీహర్ వాసికి తీవ్ర గాయాలు

Tue,December 3, 2019 08:47 PM

చింతకాని : ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి బీహర్‌కు చెందిన యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహర్ రాష్ర్టానికి చెందిన అఖిలేశ్ నర్సాపూర్ నుంచి నాగర్‌సోల్ వెళ్లే షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడలో ఎక్కాడు. మార్బుల్ పనులు చేసే నిమిత్తం హైదరాబాద్ వెళ్తుండగా నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో ఫుట్‌బోర్డు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడడంతో తీవ్రగాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు వెంటనే 108కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108సిబ్బంది యువకుడికి ప్రాథమిక చికిత్స అందించి అనంతరం ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

687
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles