భూపతిరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి: ఎంపీ కవిత

Thu,November 15, 2018 10:16 AM

Bhupathi Reddy should resign his mlc post says mp kavitha

నిజామాబాద్: ఎమ్మెల్సీ భూపతిరెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ ద్వారా వచ్చిన పదవిని ఆయన వదులుకోవాలన్నారు. డి. శ్రీనివాస్‌పై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎంపీ కవిత నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలు ఏర్పాటు చేసింది ప్రజా కూటమి కాదు.. అది ప్రజలు లేని కూటమి అన్నారు. చంద్రబాబుతో పొత్తు ఎందుకో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. కూటమి కుట్రలను ప్రజలు గమనించాలని కోరారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న వారినే మళ్లీ గెలిపించాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. ప్రజా నాయకుడు బాజిరెడ్డి గోవర్దన్‌ని మళ్లీ గెలిపించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

2526
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles