పులిని వేటాడిన నారసింహుడు.. ఘనంగా అడవిలో పార్వేట్ ఉత్సవం

Wed,February 20, 2019 08:27 PM

Bheerpur laxmi narasimha swamy brahmotsavalu continuing in jagityal

కొనసాగుతున్న బీర్‌పూర్ లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు
జగిత్యాల: జిల్లాలోని బీర్‌పూర్ లక్ష్మీనర్సింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం అడవిలో పార్వేట్ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దట్టమైన అడవుల్లో లక్ష్మీనర్సింహస్వామి గుర్రంపై స్వారీ చేస్తూ ఆలయం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టల వద్ద పులిని వేటాడి సంహరించే సన్నివేశాన్ని నిర్వహించారు.

స్వామి వారు చిన్నగుట్టపై వెలవక ముందు పెద్ద గుట్ట వద్ద జాతర జరుగుతున్న సమయంలో ఓ భక్తురాలు స్వామిని ఈ విధంగా ప్రశ్నించింది.. ఇంతపెద్ద గుట్టపై వెలిశావు. నేనొక్కదానిని వస్తేనే ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. వేలాదిగా వచ్చే భక్తుల సంగతేమిటని స్వామి వారిని అడిగింది. అప్పుడు స్వామి సమాధానమిస్తూ నేను ఇక్కడి నుంచి గుర్రంపై వెళ్తాను. ఎక్కడైతే ఆగుతానో అక్కడ వెలుస్తానని చెప్పి స్వామి గుర్రంపై వేటకు వెళ్తుండగా అరణ్యంలో గుట్ట వద్ద గుర్రం కాలు జారి బెనకడంతో తన గమ్యం ఇక్కడి వరకే అనుకొని వెనక్కి తిరిగి దగ్గరలోని చిన్న గుట్టపై వెలిసినట్లు చరిత్ర చెబుతోంది. స్వామి వారి గుర్రపు కాళ్ల అచ్చులు ఉన్న ప్రాంతానికి స్వామి వారిని మేళతాళాలతో పల్లకిలో తీసుకువెళ్లి పులిని సంహరించే మహా ఘట్టాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు.

2652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles