ఘనాక్రమంలో భద్రకాళి

Fri,July 12, 2019 09:25 PM

bhadrakali goddess decorated as ghana kramam today

-అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వినయభాస్కర్
వరంగల్: నగరంలోని భద్రకాళి ఆలయంలో శాకంబరి మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారిని శుక్రవారం ఉదయం ఘనాక్రమంలో, సాయంత్రం నీలపతాక్రమంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.

అమ్మవారిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ దంపతులు దర్శించుకుని మొక్కులు సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో అర్చకులు, ఆలయ సిబ్బంది ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles