బీటీపీఎస్ యూనిట్-2లో లైటప్ విజయవంతం

Sat,October 19, 2019 09:30 PM

మణుగూరు : ఈ ఏడాది చివరలోపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పరిధిలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) పరిధిలోని మూడు యూనిట్లను పూర్తి చేస్తామని, వచ్చే ఏడాది మార్చిలోపు 4 యూనిట్ పూర్తి చేస్తామని జెన్కో డైరెక్టర్ (ప్రాజెక్టు) ఎం.సచ్చితానందం పేర్కొన్నారు. బీటీపీఎస్ పరిధిలోని యూనిట్-2లో బాయిలర్ లైటప్ ప్రక్రియను ప్రారంభించి మాట్లాడారు. లైటప్ ప్రక్రియ విజయవంతమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషితో ఇంజినీర్లు, అధికారులు విజయవంతం చేశారన్నారు. మిగిలిన 3, 4 యూనిట్లలో కూడా నిర్ణీత సమయంలో లైటప్ చేస్తామన్నారు.


టీఎస్ జెన్కోఅండ్ ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశానుసారం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అన్ని రకాల పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు పట్టుదలతో కష్టపడి పనిచేస్తున్నామన్నారు. ఆయన వెంట బీటీపీఎస్ సీఈ పిల్లి బాలరాజు, బీహెచ్‌ఈఎల్ జనరల్ మేనేజర్ అగర్వాల్, జెన్కో, భేల్ అధికారులు మహేందర్‌రావు, నాగేశ్వరరావు, విరేశం, రాజేంద్ర ప్రసాద్, రవీందర్, సంపత్, మంగీలాల్, ప్రవీన్, నరేష్, కూయికర్, రంజిత్‌పాల్, జాడే జెన్కో, బీహెచ్‌ఈఎల్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

481
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles