సంక్రాంతికి ఊరెళ్లే వాళ్లు పాటించాల్సిన సూచనలు..

Sat,January 12, 2019 09:59 AM

before going to village everyone should follow these suggestions

హైదరాబాద్: సంక్రాంతికి ఊరు వెళ్త్తున్నారా... అయితే పోలీసుల సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే ఇళ్లలోని విలువైన వస్తువులు, ఆభరణాలు భద్రంగా ఉంటాయని పోలీసులు భరోసా ఇస్తున్నారు. కాలనీలు, అపార్టుమెంట్లలో నివాసముంటూ ఇళ్లకు తాళాలు వేసి కుటుంబం మొత్తం ఊరు వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటే ముందస్తు కనీస జాగ్రత్తలు పాటించాని మలక్‌పేట డివిజన్ ఏసీపీ మంత్రి సుదర్శన్ చెబుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తప్పక సమాచారం అందించాలని, దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదుచేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై పోలీసుల ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తారని తెలిపారు. పండుగ సెలవులు పూర్తియ్యే వరకు ప్రత్యేక పోలీస్‌టీమ్‌ను ఏర్పాటు చేసి దొంగతనాలు జరుగుకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేసి అవసరమైన చర్యలు తీసుకుంటారని, సంక్రాంతి పండుగను పూర్తిచేసుకుని వచ్చేంతవరకు దొంగతనాలు జరుగకుండా పోలీసు నిఘాను తీవ్రతరం చేస్తున్నుట్లు ఆయన తెలిపారు.

- బంగారు, వెండీ ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులను ఇళ్లలో ఉంచరాదు. వాటిని బ్యాంకుల్లో భద్రపర్చుకోవాలి.
- బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి.
- అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
- కాలనీల్లో అనుమానాస్పదంగా తిరిగే వారిపై స్థానికులు నిఘా పెట్టాలి.
- ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటివారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి.
- విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు.
- ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.
- ఊరు వెళ్లే వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి.
- ఏమైనా నేరాలు జరిగితే తమకు సమాచారం అందించాలని, అనుమానిత వ్యక్తుల కదలికలపై గమనించి
తనకు 9490616380 ఫోన్ చేసి సమాచారం అందించాల్సిందిగా ప్రజలకు సూచించారు.

1423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles