దాహం తీర్చుకునేందుకు బావిలోకి దిగి ఎలుగుబంటి మృతి

Mon,May 20, 2019 07:57 PM

bear died in well while trying to drink water in wanaparthy dist

వనపర్తి: దాహం తీర్చుకునేందుకు బావిలోకి దిగి ఓ ఎలుగుబంటి మృతి చెందిన సంఘటన జిల్లాలోని గోపాల్‌పేట మండలంలోని బుద్దారం గండి సమీపంలో వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని అటవీ ప్రాంతం సమీపంలో గండి శివాలయం వెనక గుట్టల మధ్య ఉన్న పాత వ్యవసాయ బావి వద్దకు దాహం తీర్చుకునేందుకు వచ్చిన ఎలుగుబంటి బావిలోకి దిగుతూ దుసరి తీగలో చిక్కుకుంది. ఎటూ వెళ్ల లేక దాహం, ఆకలికి తట్టుకోలేక మృత్యువాత పడింది. అది చనిపోయాక దుర్వాసన రావడంతో చుట్టు పక్కన పొలాల రైతులు బావి వద్దకు వెళ్లి చూడగా బావిలో ఎలుగు బంటి మృతి చెంది, కుళ్లిపోయి కనిపించింది. వారం రోజుల కిందట ఎలుగు బంటి మృతి చెంది ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు.

2818
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles